The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

Listen on:

  • Apple Podcasts
  • Podbean App
  • Spotify
  • Amazon Music
  • iHeartRadio
  • PlayerFM
  • Listen Notes
  • Podchaser
  • BoomPlay

Episodes

20 minutes ago

క్రీస్తు పునరుత్థానము - దేవుని శక్తి కార్య రూపం దాల్చుట
ఈ ఈస్టర్ సందేశములో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు యేసు యొక్క పునరుత్థానము యొక్క ప్రాముఖ్యతను మరియు దాని వలన మనపై ఈ నాడు ఉన్న ప్రభావాలను తెలుపుతున్నారు. 
మీరు ఈ వర్తమానాన్ని వింటూండగా, దేవుని పునరుత్థాన శక్తిలో మీరు నడచుట మీ కోరిక కావాలని, తద్వారా దేవుని రాజ్యం కోసం మీరు ప్రభావవంతంగా జీవించాలని మేము ప్రార్థిస్తున్నాము.
ఈ పునరుత్థాన శక్తి మీపై తుడిచివేయబడలేని శాశ్వతమైన ముద్రగా ఉండును గాక. ఆమేన్!

Wednesday Apr 16, 2025

రాజు, ఆయన రాజ్యం
ఈ మట్టలాదివార సందేశంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు యేసు క్రీస్తు రాజరికాన్ని నొక్కి చెబుతూ దేవుని రాజ్యంలో భాగం కావడం వల్ల మనకు కలిగే పరివర్తనాత్మక ప్రయోజనాలను తెలుపుతున్నారు. పౌరులుగా మనం క్షమాపణ, నిత్యజీవము, పుత్రత్వము, శాంతి, ఆనందం, జ్ఞానం మరియు మరిన్నింటిని ఎలా ఆస్వాదించవచ్చో ఇక్కడ కనుగొనండి.
మన రాజు యొక్క సర్వాధిపత్యము మరియు ఆయన త్యాగాన్ని ధ్యానిస్తుండగా మీరు దేవుని సంపూర్ణతలో నడుస్తూ ఆయనను ఘనపరిచే జీవితాన్ని జీవించుదురు గాక. ఆమేన్!

Tuesday Apr 08, 2025

ఈ వర్తమానంలో పాస్టర్ బెన్ గారు పంటను కోయుటకు కీలక అంశాలు తెలియజేస్తుండగా మనము విందాం.
విత్తుట మరియు కోయుట అనే నియమాన్ని ఆయన ఇక్కడ నొక్కి చెపుతున్నారు. మనమేమి విత్తుతామో, అదే పంట కోస్తాము.
విత్తడము, కోయడము మన బాధ్యత, పంటను అభివృద్ధి పరచుట దేవుని బాధ్యత. 
మీ జీవితములో దేవునికి ప్రాధాన్యతనిచ్చి, విధేయత చూపించి మరియు ఆయనను సేవిస్తూ ఉంటే, దేవుని సమకూర్పును, అభివృద్ధిని మీరు అనుభవిస్తారు. 
ఆశీర్వదింపబడండి!!

Wednesday Mar 26, 2025

దేవుని యొక్క ఆశీర్వాదము 
మన సఫలత మరియు అభివృద్ధి దేవుని చిత్తము అనే విషయాన్ని నొక్కి చెబుతూ, అబ్రాహాము, అతని సంతానానికి ఇవ్వబడిన అదే ఆశీర్వాదము మరియు శక్తి ఎలా విశ్వాసులమైన మనకిప్పుడు లభించాయో అనే అంశాన్ని పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు మనకిక్కడ తెలుపుతున్నారు. 
అబ్రాహాము ఆశీర్వాదమే మన పైకి కూడా వచ్చుటకు క్రీస్తు చేసిన శాప విమోచన కార్యాన్ని నొక్కి చెబుతూ, మనము ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించుటయే దేవుని కోరిక అని ఈ పాడ్కాస్ట్ ముఖ్యాంశముగా పేర్కొంటుంది. 
ఆశీర్వదింపబడండి!

Tuesday Mar 18, 2025

ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నా, కరవు లాంటి కాలములో కూడా విత్తుతూ ఉండండి. త్వరలోనే సమృద్ధి అనే పుష్కలమైన నీటిలో మీరు ఈదుతుంటారు.
మీ ఆర్థిక విషయాల్లో మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? పాస్టర్ బెన్ గారి వద్ద మీ కోసం సరైన వాక్యముంది. అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుడు తన బిడ్డల కొరకు ఎలా అన్నీ సమకూరుస్తాడో ఈ పాడకాస్ట్లో తెలుసుకోండి. 
లోకము మీ భాగ్యాన్ని చూసి అసూయపడి, సమస్తాన్ని సమకూర్చే మన దేవుని వైపు నడిపించబడును గాక. యేసు నామములో, ఆమేన్!

Monday Feb 10, 2025

పాస్టర్ బెన్ కోమనాపల్లి జూనియర్ గారు విశ్వాసం ద్వారా జీవించడం గురించి ప్రసంగించారు వినండి. వారు - విశ్వాస మూలముగా జీవించుట అను క్రొత్త శీర్షికకు పునాది వేశారు
వారు  విశ్వాసము 'ఎందుకు' మరియు విశ్వాసం అనగా 'ఏమిటి' గురించి, మరియు విశ్వాసం యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి కారణాల గురించి ప్రసంగించారు.
మీరు ఈ శక్తివంతమైన పోడ్‌కాస్ట్ వింటున్నప్పుడు, విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో మీరు అర్థం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గుర్తుంచుకోండి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏకైక మార్గం విశ్వాస మూలముగా జీవించడం.

Tuesday Jan 28, 2025

ఎంచుకొనుటకు స్వతంత్రులైయున్నారు  చేయుటకు స్వతంత్రులైయున్నారు ఉండుటకు స్వతంత్రులైయున్నారు
పాస్టర్ బెన్ గారు ప్రసంగించిన ఈ శక్తివంతమైన పోడ్‌కాస్ట్‌లో దేవుని ప్రతి బిడ్డకు చెందిన మర్మమును, వాస్తవికత మరియు స్వేచ్ఛను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.
మీరు వింటున్నప్పుడు, నూతన సృష్టి గుర్తింపును మరియు మీరు దేవుని ప్రయోజనాలలో మరియు ఆయన సంపూర్ణతలో నడవవలసిన స్వేచ్ఛ గురించి మీ అవగాహనను సవాలుగా పునపరిశీలించమని మేము ప్రార్థిస్తున్నాము.
మీ జీవితంలో స్వేచ్ఛను పాలించనివ్వండి. ఆమేన్!

Copyright 2024 All rights reserved.

Version: 20241125