The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

Episodes

7 days ago

1hr 3 min

దేవుడు విశ్వాసులకు అన్య భాషలలో మాట్లాడే వరాన్ని ఎందుకు ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా?
ఎంతో ఙ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కొందరు విశ్వాసులు ఎందుకు భాషలలో మాట్లాడడానికి దూరంగా ఉంటారో వివరించి, భాషలలో మాట్లాడుటకు సంబంధించిన బైబిలు ఆధారమైన కారణాలను మరియు ప్రయోజనాలను తెలియజేస్తున్నారు.
ఈ అమూల్యమైన వరాన్ని స్వీకరించి, మీ పరలోక తండ్రితో మీ సంబంధాన్ని మరింతగా బలపరచుకోండి. క్రీస్తులో దేవుడు మీ కొరకు దాచియుంచిన మర్మాలను ముందుకు సాగి స్వతంత్రించుకోండి. భాషలలో మాట్లాడుటను అభ్యసించుటలో మీరు మరింతగా ఎదుగుదురు గాక.

Jul 16, 2026

48 min

మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా?
ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పరిశుద్ధాత్మ అంతర్నివాసం మరియు నింపుదల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తున్నారు.
దేవుని అతీతమైన శక్తిలో ఎలా నడవాలో, పరిశుద్ధాత్మతో నింపబడుటకు సంబంధించిన రెండు కీలక సత్యాలను, అలాగే అన్యభాషలలో ప్రార్థించేందుకు పరిశుద్ధాత్మ ఎలా వాక్ శక్తి  అనుగ్రహిస్తాడో ఇక్కడ తెలుసుకోండి.
మీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యానికి మీరు ఎన్నటికీ అపరిచితులుగా ఉండక, ఆత్మలోను, మనస్సుతోను ప్రార్థించే సంపూర్ణ అనుభవాన్ని మీరు పొందుదురు గాక.

Jul 6, 2026

51 min

మీ భవిష్యత్తు, మీరు ఎవరిని వివాహం చేసుకుంటారు, ఐదేళ్ల తర్వాత ఎక్కడ ఉంటారు, లేదా మీ వ్యాపారం విజయవంతమవుతుందా అలాంటి విషయాలు మీకు తెలుసా? లేక ఇవన్నీ ఇప్పటికీ మీకు మర్మముగానే ఉన్నాయా? ఆ మర్మాలను ముందుగానే మీకు తెలియజేయగల ఒకరు ఉన్నారని మీకు తెలుసా?
ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మర్మాలను బయలుపరచుటలో నిష్ణాతుడైన పరిశుద్ధాత్మ గురించి బోధిసస్తూ, మర్మాల గురించి మూడు కీలక సత్యాలను, అలాగే పరిశుద్ధాత్మ మనలో ఎలా అంతర్నివసిస్తారో విస్తరిస్తున్నారు.
ఏ విషయమూ మీకు మరుగై ఉండకుండా, ఇప్పటికే మీలో ఉన్న దైవిక జ్ఞానాన్ని నిరంతరం మీరు చేదుకుంటూ, సమయాన్ని వృథా చేయకుండా, దేవుడు మీ కొరకు సిద్ధపరచిన మహిమగల గమ్యాన్ని మీరు ముందుకు సాగి స్వాధీనపరచుకొందురు  గాక.

Jun 30, 2026

1hr 7 min

పరిశుద్ధాత్మ – కృప గల ఆత్మమీరు యేసును ప్రేమిస్తున్నారు కానీ మీ జీవితంలో సాక్ష్యం, విడుదల, ఆనందం, సమాధానం, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, ప్రార్థనకు, మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి శక్తి లేన్నట్లు అనిపిస్తుందా? అయితే ఈ ఒక్క సత్యాన్ని గ్రహించడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు.
పరిశుద్ధాత్మపై కొనసాగుతున్న ఈ సిరీస్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ప్రతి విశ్వాసికి అత్యంత అవసరమైన ఒక సత్యాన్ని మనకు కళ్ళు విప్పుతున్నారు: ఆత్మీయ ఎదుగుదల. దేవుడు మన కొరకు సిద్ధపరచిన సమస్త ఆశీర్వాదాలను ముందుకు సాగి, స్వాధీనం చేసుకోవడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ ఎదుగుదల ఎంతో కీలకం. అలాగే, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం మన ఆత్మీయ ఎదుగుదలతో ఎలా సంబంధితమై ఉందో, మరియు నూతన నిబంధన ప్రకారం జీవించడానికి  పరిశుద్ధాత్మ పోషించే అత్యంత ముఖ్యమైన పాత్రను ఆయన వివరిస్తున్నారు.
ఈ సందేశాన్ని విని మీ భావోద్వేగాలు లేదా పరిస్థితులాధారంగా కాకుండా మీ జీవితంలోని ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ నాయకత్వంతో నడవాలని  నిర్ణయించుకోండి.

Jun 15, 2026

57 min

మీరు ప్రతి ఒక్క సారి విజయంలోనే నడచుటకు  మీకు సహాయం చేసే వారు ఒకరు ఉన్నారని మీకు తెలుసా?
ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, విశ్వాసులు పరిశుద్ధాత్మతో మరింత లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఎలా నిరంతర విజయాన్ని అనుభవించగలరో వెల్లడిస్తున్నారు.
ఈ సందేశం ద్వారా మీరు పరిశుద్ధాత్మ సన్నిధిని గుర్తించడం, ఆయన నడిపింపును విశ్వసించడం, ఆయన ప్రేరేపణలకు విధేయత చూపించడం నేర్చుకొని దేవుడు మీ కొరకు సిద్ధపరచిన నిశ్చయమైన విజయంలో మీరు నడవగలుగుతారు.
ఈ సందేశాన్ని విని, పరిశుద్ధాత్మచే నడిపించబడే జీవితానికి ఉన్న ప్రత్యేకమైన ఆధిక్యతను తెలుసుకోండి.

Jun 10, 2026

1hr 3 min

మీరు జీవితంలో అన్ని వైపుల నుండి దాడులు ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తూ, బయటపడే మార్గమే కనిపించని స్థితిలో ఉన్నారా? మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారా? మీకు సమాధానం ఇక్కడ ఉంది!
ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్  గారు, దేవుడు తన పిల్లలు విజయవంతమైన జీవితాన్ని జీవించాలని ఎంతగా కోరుకుంటున్నాడో తెలియజేస్తున్నారు. అలాగే, దేవుడు మన కొరకు సిద్ధపరచిన విజయవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఆయనపై ఆధారపడడం ఎంత ముఖ్యమో బోధిస్తున్నారు.
విజయం మీ జన్మహక్కు. పరిశుద్ధాత్మ ద్వారా మరియు యేసు నామమందలి విశ్వాసం ద్వారా, మీరు నిశ్చయమైన  విజయాన్ని మీ జీవితంలో పొందగలరు, వ్యక్తపరచగలరు మరియు అనుభవించగలరు. దీనినే, దీనిని మాత్రమే నమ్మండి, మరియు క్రీస్తులో ఇప్పటికే మీదైయున్న విజయంలో నడవండి.

May 29, 2026

1hr 10 min

మీ క్రైస్తవ జీవితంలో శక్తిలేకుండా జీవిస్తున్నారని అనిపిస్తున్నదా?
ఈ పెంతెకొస్తు ఆదివారాన, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి స్పష్టమైన, లేఖనాధారిత బోధనను అందిస్తున్నారు. మీరు తిరిగి జన్మించిన విశ్వాసిగా దేవునిని మరింత లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తున్నా, లేదా జీవితంలోని పోరాటాలపై విజయాన్ని కోరుతున్న వ్యక్తి అయినా, మీరు పరిశుద్ధాత్మను తెలుసుకోవడం ఎంతో అవసరం.
ఈ వర్తమానములో, మీరు నీటి బాప్తిస్మం మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మం మధ్య తేడా ఏమిటో, పరిశుద్ధాత్మతో నింపబడుటకు బైబిలు చూపించే మార్గం ఏమిటో, అలాగే అన్య భాషలలో మాట్లాడుట యొక్క రహస్యం మరియు వాటి ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుంటారు.
అన్య భాషలు మాట్లాడే సూచనతో కూడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవాన్ని పొందుటకు మీలో ఆత్మీయ ఆకలి కలుగును గాక; మరియు దేవుడు మీ ద్వారా శక్తివంతమైన కార్యములు చేయుట  మీరు చూచుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

May 19, 2026

1hr 8 min

మీరు నిజంగా శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారా?
ఈ వర్తమానములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేశాడో, మరియు ఇప్పుడు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మకు సంబంధించి విశ్వాసులకున్న వాస్తవికత ఏమిటో వివరిస్తున్నారు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కొంత కాలం మాత్రమే మనుష్యుల మీదకు దిగి వచ్చే వాడు; కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసిలో ఆయన ఇప్పుడు శాశ్వతంగా నివసిస్తున్నాడని పాస్టర్ గారు వెల్లడిస్తున్నారు.
ఈ సందేశం పరిశుద్ధాత్మను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతపై మీకు బలమైన పునాదిని వేయడానికి మాత్రమే కాక, తండ్రి ఇచ్చిన ఈ అమూల్యమైన వరమైన పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మీ సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుకోవడానికి సహాయపడుతుంది.
మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొంది, దేవుని మహిమ కొరకు మీ జీవితాలు సమూలంగా మార్చబడును గాక!

Copyright 2024 All rights reserved.

Version: 20241125