The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!
Episodes

Wednesday Oct 29, 2025
Wednesday Oct 29, 2025
దేవుని రాజ్యములోనికి, విశ్వాసుల జీవితాల్లోనికి ధనము ఎలా ప్రవహించాలో అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సంపద బదిలీని గురించిన మర్మాన్ని, లోకస్థుల చేతుల్లో నుంచి, తన బిడ్డల చేతుల్లోనికి దేవుడు వనరులను వ్యూహాత్మకంగా ఎలా మారుస్తాడో ఈ శక్తివంతమైన సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తూండగా వినండి.
ఈ వర్తమానంలో, మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు:• సంపద బదిలీ జరిగే 3 విధానాలు: వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవంతముగా.• దుష్టులు మరియు నీతిమంతుల మీద ఈ 3 విధానాల ప్రభావము.• విశ్వాసులు, దుష్టులు మరియు దేవుడు ఎలా ఈ సంపద బదిలీ జరిగే ప్రతి విధానాన్ని నిర్ణయిస్తారు?• దేవుని రాజ్య సంపదను బలోపేతం చేసే జ్ఞానపు 5 కోణాలు.• పాపాత్ముడు పోగు చేసినదానంతటితో సహా ఒక మంచి వ్యక్తి ఎలా ఙ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని పొందుకుంటాడు?
మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని రాజ్యపు సంపదను గురించి మీకున్న జ్ఞానము పెరిగి, నమ్మకమైన గృహనిర్వాహకునిగా ఉండుటకు మీరు దైవిక జ్ఞానములో ఎదుగుతూ గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక!

Thursday Oct 23, 2025
Thursday Oct 23, 2025
ఆర్థికంగా మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మరింతగా చేయాలని కోరుతున్నారా? అయితే, ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తలాంతుల యొక్క ఉపమానము ద్వారా ఆర్థిక విషయాలను గురించిన కాలాతీతమైన వాక్య జ్ఞానాన్ని పంచుకుంటూండగా వినండి.
మీరీ సందేశాన్ని వింటూండగా మీ వనరులను జ్ఞానయుక్తంగా నిర్వహిస్తూ దేవుని రాజ్యంలో ధారాళంగా పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రేరణ పొందాలని మా ప్రార్థన.
మీరు అమితంగా ఆశీర్వదించబడి గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక.

Wednesday Oct 15, 2025
Wednesday Oct 15, 2025
గురుగుల మధ్యలో కూడా గోధుమ వలె పెరగండి!
రూపాంతరం చెందిన వ్యక్తులు లోకపు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో, దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించే గోధుమలు గురుగులు అనే ఉపమానము ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనకు ఈ వర్తమానంలో చూపిస్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా మీ కోరికలు, పనులు మరియు మీ జీవితము ఇతరులను ప్రభావితం చేసిన విధానాన్ని గురించి ఒక సారి ఆలోచించండి. మంచి మార్పును తీసుకువచ్చే గోధుమ వలె, చీకటిలో వెలుగుగా ప్రకాశించడానికి మీ జీవితములో మూడు తక్షణ చర్యలను ఇప్పుడే తీసుకోండి.
మీరు సరైన నేలలో ఇష్టపూర్వకంగా నాటబడిన విత్తనంగా ఉండి, దేవుని మహిమ కోసం శాశ్వత ప్రభావాన్ని చూపుదురు గాక!

Tuesday Oct 07, 2025
Tuesday Oct 07, 2025
అర్థవంతమైన విధానాల్లో, లోకము గమనించునట్లు దేవుని మహిమను ప్రతిబింబించగలిగే దైవికమైన కృపను ఎలా పొందుకోవాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు విశ్వాసులను బలపరుస్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమార్థమై మీరు అధికముగా ఫలించుటకున్న దైవిక క్రమాన్ని పాటించుటకు కట్టుబడియుండి, తద్వారా క్రీస్తు రక్షణ కృప వైపునకు ప్రజలను త్రిప్పుతారని మా ప్రార్థన.
దేవుని మహిమను కనపరచుటకు మీరు ఏర్పరచబడ్డారు. ఆ మహిమలో నడుస్తూ ఉండండి!

Wednesday Oct 01, 2025
Wednesday Oct 01, 2025
గాయపు మచ్చలు ఎంత లోతున్నా - నిరీక్షణ అంత కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది.
బాధపరచబడ్డారా? తిరస్కరించబడ్డారా? అలక్ష్యం చేయబడ్డారా? స్వస్థత, నిరీక్షణ, ఓదార్పునిచ్చే పాస్టర్ అర్పిత కొమానపల్లి గారి ఈ వర్తమానాన్ని వినండి. మీ గాయాలను తన మహిమకు నిదర్శంగా మార్చుటకు దేవుడు ఒక వజ్రము వలె ఎలా మిమ్మల్ని ప్రేమతో రూపించి మలచి, మెరుగుపరుస్తాడో తెలుసుకోండి.
మీ బాధలను అధిగమించి, దేవుని ప్రియమైన బిడ్డగా మీకున్న గుర్తింపును స్వీకరించి, బలంగా నిలిచి, నూతన బలం మరియు ధైర్యంతో నడుస్తూ ఉందురు గాక. యేసు నామంలో, ఆమేన్!

Thursday Sep 25, 2025
Thursday Sep 25, 2025
The Glory of God, The Victory of All
In this powerful sermon, Pastor Benjamin Komanapalli Jr. talks about the privilege and importance of manifesting God’s glory to see real change in the world around us.
As you listen, we pray that you position yourself on the rock of Jesus and take on the responsibility of showing God’s glory in and through your life.
May your life be filled with the glory of God. In Jesus' name, Amen!
దేవుని మహిమ, మనందరి విజయము
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిజమైన మార్పును చూచుటకు దేవుని మహిమను మనము కనబరచే ఆధిక్యత మరియు ప్రాముఖ్యతను గురించి ఈ శక్తివంతమైన వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధిస్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా, క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని మీరు సరియైన స్థానంలో ఉంచుకొని, మీ జీవితాలలో, జీవితాల ద్వారా దేవుని మహిమను చూపే బాధ్యతను తీసుకుంటారని మా ప్రార్థన.
మీ జీవితాలు దేవుని మహిమ చేత నింపబడును గాక. యేసు నామములో, ఆమేన్!

Wednesday Sep 17, 2025
Wednesday Sep 17, 2025
మీకై ఉన్న దైవిక గమ్యాన్ని చేరుకొనుట: నిజమైన విజయానికి యాత్ర!
ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దైవిక గమ్యానికి అర్థం, దానిని చేరుకొనే మార్గాలు, మీకై ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని కనుగొన్న తరువాత చేయాల్సిన పనులను గురించి ఎంతో స్ఫూర్తిదాయకమైన వర్తమానాన్ని అందిస్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా దేవుడు మీకై ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ, సమాధానం, మంచి భవిష్యత్తు గురించినవై ఉన్నాయనే సత్యంలో మీరు వేరుపారాలని మా ప్రార్థన!
నిజమైన విజయాన్ని చేరుకొనులాగున దేవుని వాక్యానికి మీ జీవితమంతా విధేయత చూపుచు నడిపింపబడుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

Friday Sep 12, 2025
Friday Sep 12, 2025
విధేయతతో నడవడం: దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడం
ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనమెలా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలమో తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని సూచనలు భారమైనవి కాదు కానీ, నీ మంచి కొరకే, నీ గమ్యానికి చేర్చే దారి అని నీవు గ్రహించాలని మా ప్రార్థన.
నీవు దేవుని సూచనలను పాటిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం నీతో పాటు వెళ్తూ, నీకు స్థిరమైన విజయాన్ని, దేవునికి మహిమను తెచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

Tuesday Sep 02, 2025
Tuesday Sep 02, 2025
దేవుని ప్రణాళికను తెలుసుకో - నీవెంతో గొప్ప సఫలతను చూస్తావు.
ఈ సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుటకు వివిధ మార్గాలను తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, మీకై దేవునికున్న ప్రణాళికను నమ్ముటకు ప్రేరేపించబడి, విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు ప్రోత్సాహపరచబడాలని మా ప్రార్థన.
మిమ్మును మీరు సరైన స్థలములో, సరైన సమయములో కనుగొని, మీ దైవికమైన గమ్యాన్ని చేరుకొందురు గాక!

Friday Aug 29, 2025
Friday Aug 29, 2025
దేవుని ప్రణాళిక - శ్రేష్ఠమైన ప్రణాళిక
ప్రతి ఒక్కరి జీవితాలు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మన ప్రేమగల సృష్టికర్తచే రూపింపబడ్డాయని, ఆ ప్రణాళికను మనము కనుగొని దానిలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడనే ప్రోత్సాహపూర్వక సత్యాన్ని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశంలో బోధిస్తున్నారు.
దేవుని ప్రణాళికను మనము గుర్తించకపోవుటకు గల కారణాలను పాస్టర్ గారు వివరిస్తుండగా, మీరింత వరకు గడిపిన జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించండి. తరువాత మీ పట్ల దేవునికున్న ప్రత్యేకమైన ప్రణాళికను మీకు తెలుపమని దేవునిని అడగండి.
దేవుని మహిమార్థమై, మీరు సరైన దిశలో నడుస్తూ, సరైన గమ్యాన్ని చేరుకొందురు గాక. యేసు నామములో, ఆమేన్!








