The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!
Episodes

Friday Aug 29, 2025
Friday Aug 29, 2025
దేవుని ప్రణాళిక - శ్రేష్ఠమైన ప్రణాళిక
ప్రతి ఒక్కరి జీవితాలు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మన ప్రేమగల సృష్టికర్తచే రూపింపబడ్డాయని, ఆ ప్రణాళికను మనము కనుగొని దానిలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడనే ప్రోత్సాహపూర్వక సత్యాన్ని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశంలో బోధిస్తున్నారు.
దేవుని ప్రణాళికను మనము గుర్తించకపోవుటకు గల కారణాలను పాస్టర్ గారు వివరిస్తుండగా, మీరింత వరకు గడిపిన జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించండి. తరువాత మీ పట్ల దేవునికున్న ప్రత్యేకమైన ప్రణాళికను మీకు తెలుపమని దేవునిని అడగండి.
దేవుని మహిమార్థమై, మీరు సరైన దిశలో నడుస్తూ, సరైన గమ్యాన్ని చేరుకొందురు గాక. యేసు నామములో, ఆమేన్!

Tuesday Aug 26, 2025
Tuesday Aug 26, 2025
ఇది ఎదుగుటకు సమయం!
ఈ పాడ్కాస్ట్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఒక విశ్వాసి జీవితంలో ఎదుగుదల ఒక్కొక్కటిగా ఎలా దశలలో జరుగుతుందో వివరిస్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమ కోసం మీ విశ్వాస జీవితములో ఎవ్వరూ వివరించలేని ఎదుగుదలను చూడటానికి ఆయన సత్య వాక్యము ద్వారా దేవునితో కలిసి మీరు పని చేయడానికి నిర్ణయించుకోవాలని మా ప్రార్థన!

Wednesday Aug 13, 2025
Wednesday Aug 13, 2025
మీ నాలుక: మీ విడుదలకు మూలము
ఎంతో దైవిక జ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తిని మనము ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తున్నారు. మీ జీవితాన్ని మరియు ఇతరులను ఆశీర్వదించుటకు ఎల్లప్పుడూ జీవమునే పలుకుతూ ఉండుటకు ఇప్పుడే నిర్ణయించుకోండి.
మీ మాటలు దేవుని వాక్యానికనుగుణంగా ఉంటూ, మీ జీవితములో మీకు సమృద్ధియైన పంటను ఇచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

Wednesday Aug 06, 2025
Wednesday Aug 06, 2025
విత్తుట మరియు కోయుటలోని శక్తి!
ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వెదకాలము, కోతకాలములు అను బైబిల్ సూత్రాన్ని వివరిస్తుండగా మీ జీవితంలో శాశ్వతమైన మార్పునకు సూత్రాన్ని కనుగొనండి.
మీరు చేస్తున్న పనులనొకసారి పరీక్షించుకొని, వాటిని దేవుని వాక్యానికనుగుణంగా మార్చుకొనడం ద్వారా మీ జీవితము ఎలా సంపూర్ణంగా మారిపోగలదో తెలుసుకోండి.

Wednesday Jul 30, 2025
Wednesday Jul 30, 2025
శిక్షావిధి - ఒక భయంకరమైన వేదన
నీకు నేనంత మంచివాడను/మంచిదానను కాదు అనిపిస్తుంటుందా? ఏవైనా అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నించి ప్రతి సారి ఓటమి పాలయ్యావా? సానుకూల ఒప్పుకోలు చేస్తూ, నిపుణతగల మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ వాటితో ఏం ప్రయోజనం లేక చిక్కుకుపోయినట్లు అనిపిస్తుందా?
లేఖనాధారంగా ఉన్న ఈ విడుదలనిచ్చే సందేశంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు ఒక తుది పరిష్కారాన్నిస్తునారు: క్రీస్తుని అంగీకరించి, ఆయన రక్షణలో విశ్రమించుట. తగిన ఉదాహారణలనిస్తూ శిక్షావిధి నుంచి విడుదలై స్వేచ్ఛగా జీవించుట అనేది కేవలం సాధ్యమే గాక అది నిజమైన స్వాతంత్ర్యానికి మూలం అని ఆయన చెపుతున్నారు.
ఈ సందేశాన్ని విని, ఎటువంటి అపరాధ భావన, అవమాన భారము లేని ధైర్యము, శక్తితో కూడిన స్వేచ్చా జీవితాన్ని జీవించుటకు శక్తిని పొందండి. ఆమేన్!

Tuesday Jul 22, 2025
Tuesday Jul 22, 2025
మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడను మర్మము
ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు సిలువ తర్వాత జీవించుచున్న వారికి ప్రత్యేకంగా ఉన్న గొప్ప ఆధిక్యతను వెల్లడిస్తున్నారు: అది, క్రీస్తు మనలో నివసించుట, మనం ఆయనలో నివసించుట అనే మర్మము.
మీరు వ్యాపారస్తులైనా, తల్లిదండ్రులైనా, వైద్య నిపుణులైనా, విద్యావేత్తలైనా, లేదా దేవుని సేవకులైనా, క్రీస్తును మరియు ఆయన సిలువ మరణాన్ని తెలుసుకొనుటపై మీ దృష్టిని కేంద్రీకరించి, దైవిక ఫలితాలను అనుభవించాలని మేము ప్రార్థిస్తున్నాము.
మీరు క్రీస్తులో ఇది వరకే ఏమైయున్నారో, అలా అవుటకు ప్రయత్నించడం మానివేసి, దేవుని సంపూర్ణతలో నడుస్తూ, ఆయన శక్తిని ఇతరులకు చూపించుదురు గాక. యేసు నామంలో, ఆమేన్.

Wednesday Jul 16, 2025
Wednesday Jul 16, 2025
నమ్ముటయే విశ్రమించుట!
పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారి ఈ సందేశము ఒక క్రైస్తవునికి ‘విశ్రాంతి’ యొక్క నిజ అర్థం ఏమిటో అనే సత్యానికి మన కళ్ళు తెరుస్తుంది. శత్రువు తీసుకు వచ్చే అబద్ధాలను గురించి ఆయన చర్చిస్తూ, క్రీస్తుతో సహవారసులమైన మనతో దేవుని వాక్యమే మాట్లాడుతుందనే సత్యాన్ని నొక్కి చెపుతున్నారు.
ఇదే మీ విశ్రాంతి దినము. మీరీ వర్తమానాన్ని వింటూండగా, దేవుని వాగ్దానాలను నమ్మి, వాటిలో నడుచుట ద్వారా ఇప్పుడే మీ విశ్రాంతిని మీరు పొందుకోవాలని మా ప్రార్థన.
మీరు మీ స్వంత క్రియల మీద ఆధారపడుట మాని, దేవుని కృప మీదనే సంపూర్ణముగా ఆధారపడి, మీ రక్షణ అనే విశ్రాంతి స్థలములోనికి ప్రవేశించుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

Wednesday Jul 09, 2025
Wednesday Jul 09, 2025
ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు బైబిల్‌లోని గత మరియు ప్రస్తుత సత్యాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటిని అర్థం చేసుకోవడంలో సందర్భం మరియు సమయాన్ని వివేచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుడు మనకిచ్చిన సమృద్ధి జీవితాన్ని దోచుకునే సంప్రదాయాలను తిరస్కరించాలని మరియు సిలువ తర్వాత క్రీస్తు మనకిచ్చిన జీవితము మనము జీవించడము గొప్ప భాగ్యం, ఆధిక్యత అని మనము గ్రహించాలని మా ప్రార్థన.
దేవుడు ఈ కాలములో చేస్తున్న దానంతటికీ మీ కళ్ళు, చెవులు, హృదయము ఎల్లప్పుడూ తెరచి ఉండును గాక. యేసు నామములో, ఆమేన్!

Wednesday Jun 18, 2025

Tuesday Jun 10, 2025
Tuesday Jun 10, 2025
పరిశుద్ధాత్మ అగ్ని - విశ్వాసి యొక్క ఆయుధం మరియు హృదయవాంఛ
ఈ పెంతెకొస్తు ఆదివార ప్రసంగంలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు పెంతెకొస్తు దిన ప్రాముఖ్యతను, దేవుని వాక్యానికి మరియు ఆయన ఆత్మకు మధ్య ఉన్న అవినాభావ బంధాన్ని మరియు అన్య భాషల్లో మాట్లాడే రుజువుతో పరిశుద్ధాత్మతో నింపబడి, తిరిగి నింపబడవలసిన ఆవశ్యకతను తెలుపుతున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా, పరిశుద్ధాత్మ సన్నిధి మీలో వెలిగింపబడి, దేవుని మహిమార్థమై రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, చనిపోయిన వారిని లేపుటకు మీరు శక్తినొందుదురు గాక.
లోకము మీ ద్వారా అందరినీ దేవుని ప్రేమ మరియు శక్తితో వెలిగించు పరిశుద్ధాత్మ యొక్క రూపాంతర శక్తిని చూచును గాక. యేసు నామములో, ఆమేన్!








